AP: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం దావగూడూరులో మంత్రి డీఎస్బీవీ స్వామి పింఛన్లు పంపిణీ చేశారు. దేశంలోనే పెద్ద మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని కొనియాడారు. కల్తీ నెయ్యిపై శాసనమండలిలో చర్చకు రాకుండా వైసీపీ పారిపోతోందని ఎద్దేవా చేశారు. చర్చ జరగకుండా సభ నుంచి తప్పించుకున్నా.. దేవుడి నుంచి తప్పించుకోలేరని అన్నారు.