»Enemies Also Brought Closer Komatireddy Venkat Reddy Reacts On Audio Leak
Komatireddy venkat reddy:శత్రువులను కూడా చెరదీస్తా, ఆడియో లీకుపై వెంకట్ రెడ్డి
Komatireddy venkat reddy reacts on audio leak: కాంగ్రెస్ ముఖ్యనేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy venkat reddy) ఆడియో (audio) ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ (cheruku sudhakar) కుమారుడు సుహాస్‌తో (suhas) మాట్లాడినట్టు ఆ ఆడియో (audio) ఉంది.
Enemies also brought closer Komatireddy venkat reddy reacts on audio leak
Komatireddy venkat reddy reacts on audio leak: కాంగ్రెస్ ముఖ్యనేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy venkat reddy) ఆడియో (audio) ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ (cheruku sudhakar) కుమారుడు సుహాస్‌తో (suhas) మాట్లాడినట్టు ఆ ఆడియో (audio) ఉంది. అందులో సుధాకర్‌ను (cheruku sudhakar) వెంకట్ రెడ్డి (venkat reddy) బూతులు తిట్టినట్టు వినిపించింది. ఆడియోను సుహాస్ (suhas) సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తనను, తన తండ్రిని వెంకట్ రెడ్డి (venkat reddy) మనుషులు చంపుతారట అని తెలిపారు. ఆడియో ఘటనపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy venkat reddy) స్పందించారు.
శత్రువులను కూడా దగ్గరకు తీసే మనస్తత్వం తనదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy venkat reddy) తెలిపారు. తన 33 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రోజు ప్రత్యర్థులను దూషించలేదని చెప్పారు. నా, తన భేదం లేకుండా అందరితో కలుసుకొని వెళతానని వెల్లడించారు. చెరుకు సుధాకర్ (cheruku sudhakar) తనను మొదటి నుంచి దూషిస్తున్నారని వివరించారు. ఇదే అంశంపై ఆయన కుమారుడికి ఫోన్ చేసి అడిగానని చెప్పారు. అయితే సుహాస్ మాత్రం ముఖ్యమైన అంశాలను కట్ చేశారని పేర్కొన్నారు. అందులో కొన్ని అంశాలను మాత్రమే లీక్ చేశాడన్నారు.
‘చెరుకు సుధాకర్ (cheruku sudhakar) తనను తరచూ తిడుతున్నాడు. ఇప్పటికీ 100 సార్లు తిట్టాడు. నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చి.. తననే దూషిస్తాడు. ఇంటి పార్టీ ఏందీ.. అతను వార్డు మెంబర్‌గా గెలుస్తాడా? ఓ పెద్ద నాయకుడిని ఇలా దూసించొచ్చా? నీ అయ్యకు చెప్పు.. లేదంటే నిన్ను కూడా లేపేస్తాం. నిన్ను ఆస్పత్రిని కూడా లేపేస్తాం. 30 ఏళ్లలో తనకు వేలాది మందికి ఉపాధి కల్పించా. తన అనుచరులు ఇక ఆగం.. చంపేస్తాం అంటున్నారు. వంద వాహనాల్లో తిరుగుతున్నారు. నీ తండ్రికి చెప్పు’ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. ఇందులో కొన్ని అంశాలు మాత్రమే ఉన్నాయని వెంకట్ రెడ్డి (Komatireddy venkat reddy) అంటున్నారు.
ఆడియో గురించి సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేస్తున్నారు. చెరుకు సుధాకర్ (cheruku sudhakar) ఉద్యమకారుడు అని.. ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లాడని గుర్తుచేస్తున్నారు. పీడీ యాక్ట్ పెట్టినా భయపడలేదని చెప్పాడు. మీరు (Komatireddy venkat reddy) మాత్రం ఉద్యమ సమయంలో కాంట్రాక్టులు తీసుకొని.. పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టినవు అని విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ నీటిని ఎత్తుకెళ్లి అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
చెరుకు సుధాకర్ (cheruku sudhakar) ఉద్యమ కారుడు.. ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. చాన్నాళ్లకు పొసగక బయటకు వచ్చారు. ఇంటి పార్టీని ఏర్పాటు చేశారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లక్ష్యంగా ఆయన విమర్శలు చేశారు. దీంతో ఆయన అతని (cheruku sudhakar) కుమారుడికి ఫోన్ చేసి.. బెదిరించాడు. అది రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
చెరుకు సుధాకర్ ఒక ఉద్యమకారుడు ఉద్యమంలో జైలుకు పోయినోడు పీడీ యాక్ట్ పెట్టినా అదరనోడు తెలంగాణ కోసం ఎత్తినజెండా దించనోడు
అదే నువ్వు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే.. కాంట్రాక్టులు తీసుకోని పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టినోడివి మన నీళ్లను ఎత్కపోయినోడి బొక్కలకు ఆశపడ్డోళ్లు మీరు