ASF: బెజ్జూర్ మండల మాజీ సింగిల్ విండో ఛైర్మన్ అర్షద్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో, రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ సమక్షంలో అర్షద్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అర్షద్‌కు మంత్రి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి సూచించారు.