NDL: శ్రీశైలంలో నిర్వహిస్తున్న నిత్య అన్న ప్రసాద పథకానికి కొత్తగూడెం చెందిన సీతా రాంబాబు శుక్రవారం రూ. 5,11,116 విరాళంగా అందజేశారు. స్వామి వారిని దర్శనానికి వచ్చిన ఆయన స్థానిక కార్యాలయంలో సూపరింటెండెంట్ శివప్రసాద్‌ను కలిసిన తరువాత విరాళాన్ని చెల్లించారు. దాతకు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి శేష వస్త్రాలతో సన్మానించారు.