AP: ప్రకాశం జిల్లా ఏల్చూరులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం 454 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నామని తెలిపారు. బడి మానకూడదన్న ఉద్దేశంతో దాతల సహకారంతో సైకిళ్లు పంపిణీ చేస్తున్నమని పేర్కొన్నారు. లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులు వచ్చాయని చెప్పారు.