నేపాల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా MAR 2 నుంచి 5 అర్ధరాత్రి వరకు భారత-నేపాల్ సరిహద్దు మూసివేయనున్నట్లు నేపాల్ హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. భారత్కు ఆనుకుని ఉన్న బాంకే జిల్లా అంతటా సరిహద్దు అవుట్ పోస్టులు 5 వరకు మూసివేయనున్నట్లు తెలిపింది. తప్పనిసరి అయితే తప్ప నిషేధిత కాలంలో సరిహద్దు దాటకుండా ఉండాలని 2 దేశాల పౌరులకు సూచించారు.