SDPT: ప్రభుత్వం నియమించిన విద్యా కమిటీలో నిజమైన విద్యా వేత్తలు ఎందరున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ‘X’ వేదికగా ప్రశ్నించారు. కమిటీ ఛైర్మన్గా ఒక ఇంజినీర్, సభ్యులుగా మాజీ ఐఏఎస్ అధికారులను నియమించారని, పాఠ్యాంశాల రూపకల్పనలో నైపుణ్యం ఉన్న ఒక్క సభ్యుడైనా ఉన్నారా అని నిలదీశారు.