KNR: కొత్తపల్లి మండలం ఎలగందుల వద్ద పెండింగ్లో ఉన్న బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేయనున్నట్లు, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గం ఇంఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు అన్నారు. గురువారం కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామంలో పెద్ద చెరువు అభివృద్ధికి రూ.10 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.