ఆదిలాబాద్ జిల్లాలో భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు కలెక్టర్ రాజర్షి షా కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవిలో నీటి ఎద్దడిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ తమ బోరు బావులకు ‘రీఛార్జ్ పిట్స్’ (ఇంగుడు గుంతలు) నిర్మించుకోవాలని సూచించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడం ద్వారా బోరు బావుల సామర్థ్యాన్ని పెంచవచ్చన్నారు.