అన్నమయ్య: మదనపల్లె టమాటా మార్కెట్లో గురువారం టమాటాలు కిలో రూ. 34 పలికాయని మార్కెట్ సెక్రటరీ జగదీశ్, ఛైర్మన్ శివరాం తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి రైతులు 894 మెట్రిక్ టన్నుల టమోటాలను తీసుకు వచ్చారన్నారు. వాటిలో నాణ్యమైన మొదటి రకం పది కిలోల టమాటాలు రూ.340, మోడల్ రకం రూ.320, మూడవ రకం రూ.270 లతో పరులు రైతుల దగ్గర కొనుగోలు చేసినట్లు తెలిపారు.