SKLM: జలుమూరు మండలంలో గల శ్రీ ముఖలింగేశ్వరస్వామి ఆలయ హుండీలను గురువారం ఉదయం లెక్కిస్తున్నట్లు ఈవో ఏడుకొండలు బుధవారం తెలిపారు. ఆలయంలో గల హుండీలు ఉదయం 10 గంటలకు తెరచి ఆలయ పాలక మండలి ఛైర్మన్, సభ్యులు, అర్చకులు సమక్షంలో లెక్కిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల భక్తులు డ్రెస్ కోడ్ పాటించి లెక్కింపులో పాల్గొనాలని కోరారు.