TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరుకావాలని పేర్కొంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులు, రాజకీయ నాయకుల స్టేట్మెంట్లను సిట్ అధికారులు రికార్డు చేశారు.