కరీంనగర్ జిల్లాలోని 317 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియ బుధవారం నాటికి 96% పూర్తయిందని జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా తెలిపారు. ఈ యాసంగికి సంబంధించి 317 కొనుగోలు కేంద్రాల్లో 3,32,098 మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి రాగా 3,18,959 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు.