PDPL: మంథని పట్టణంలోని శ్రీ మహాగణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి స్వామివారిని దర్శించుకున్నారు. గణపతికి దూర్వాలు, మోదకాలు, ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించి సంకటాలు తొలగాలని ప్రార్థించారు. అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చిన ఈ చతుర్థి విశేష పుణ్యప్రదమైనదిగా భావిస్తారు.