GDWL: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై అవగాహన కల్పించేందుకు అయిజ మండలంలోని 28 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ జ్యోతి తెలిపారు. ఈనెల 4న చిన్న తాండ్రపాడులో గ్రామసభ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, గ్రామస్థాయి నాయకులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు.