SKLM: పలాస మండలం పూండి గ్రామంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మదర్ థెరిస్సా సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ శిబిరంలో క్యాన్సర్, గుండె, కిడ్నీ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు.