మాచారెడ్డి మండలంలో గల 108, 102 అత్యవసర అంబులెన్సులను ఉమ్మడి జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్, జిల్లా కో ఆర్డినేటర్ తిరుపతి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, వైద్య పరికరాలు, ఆక్సిజన్ నిల్వలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండి అత్యవసర రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.