KRNL: గోనెగండ్ల (M) బి. అగ్రహారానికి చెందిన బాలిక మే 28న ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడిని రిమాండ్కు తరలించామని సీఐ చంద్రబాబు తెలిపారు. మోహన్(20) తనను ప్రేమించి పెళ్లి చేసుకోలేదని మనస్తాపానికి గురై బాలిక ఉరేసుకుంది. కేసు నమోదు చేసి, దర్యాప్తులో భాగంగా మోహన్ గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఇవాళ అరెస్టు చేసి, రిమాండ్కు తరలించామని సీఐ పేర్కొన్నారు.