AP: తెలంగాణ రాష్ట్ర సాధనపై తన నిబద్ధత ఇప్పుడు మొదలైంది కాదని జనసేన అధ్యక్షుడు, DY CM పవన్ అన్నారు. 2009లో ప్రజారాజ్యం యువరాజ్యం విభాగానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు.. ఉస్మానియా విద్యార్థి నేతలు, గద్దర్తో కలిసి తెలంగాణ సామాజిక న్యాయసభలో పాల్గొన్నట్లు తెలిపారు. YSR ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న టైంలో.. తాను తెలంగాణకు బహిరంగంగా మద్దతు తెలిపానని చెప్పారు.