PLD: నర్సారావుపేట మల్లమ్మ సెంటర్లో బుధవారం నిర్వహించిన కార్మికులకు లేబర్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి అందేలా నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.