PPM: గుమ్మలక్ష్మీపురం మండలం మంగళాపురం గ్రామంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. మంచినీటి సరఫరా వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయంగా సహజ నీటి వనరులపై ఆధారపడాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి సక్రమంగా తాగునీరు అందించాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.