VZM: వంగర మండలంలో రైతులకు 50 శాతం రాయితీపై పచ్చి రొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అదికారి కన్నబాబు మంగళవారం తెలిపారు. ఈ విత్తనాలు కిలో రూ.160 కాగా, 50% రాయితీతో రూ.80లకు అందిస్తామన్నారు. పచ్చి రొట్ట పంటసాగుతో నేలలో సేంద్రియ కార్బన్ పెరిగి, భూసారం మెరుగుపడటంతో పంటకు పోషకాలు సమృద్ధిగా లభిస్తాయన్నారు.