ADB: నార్నూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఎస్సై శ్రీసాయి జాబ్ మేళ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలోని AR హెడ్ క్వాటర్స్ వద్ద మార్చి 10వ తేదీన జాబ్ మేళ నిర్వహిస్తున్నామన్నారు. వివిధ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల ఖాళీలు ఉండటంతో నిరుద్యోగ యువత తమ ధ్రువపత్రాలతో భారీ ఎత్తున వచ్చి సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.