సత్యసాయి: సీఎం చంద్రబాబు నాయుడిని ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ కలిశారు. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని రహదారి, వంతెన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ధర్మవరం-ఎన్.హెచ్ 42 రహదారిపై దెబ్బతిన్న కాజ్వే అత్యవసర మరమ్మతుల కోసం రూ.90 లక్షలు మంజూరు చేయాలని కోరారు.