కోనసీమ: కూటమి ప్రభుత్వం కనుసన్నల్లోనే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. మంగళవారం మండపేట వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. లంక గ్రామాల్లోని ఇసుకను రాత్రి పగలు అనే తేడా లేకుండా తరలిస్తున్నారని ఆరోపించారు. వీటిని తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాలు ఆపకపోతే ముట్టడిస్తామని హెచ్చరించారు.