NLG: చిట్యాల మండలం ఏపూర్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల అభివృద్ధికి దివిస్ కంపెనీ మంగళవారం రూ.4 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఈ నిధులతో పాఠశాల మరమ్మతులు, మౌలిక సదుపాయాలు మెరుగుపరచనున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో సర్పంచ్ పాలెం మహేష్, హెచ్ఎం మోహన్ రెడ్డి, ఎస్ఎంసీ ఛైర్పర్సన్ పద్మ, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. గతంలో కూడా రూ. 5 లక్షలు ఖర్చు చేశారు.