KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామ చెరువు అక్రమ మట్టి తవ్వకాలతో క్రమంగా కనుమరుగవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేకుండానే యంత్రాలతో మట్టిని తరలిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. చెరువు భవిష్యత్తు ప్రమాదంలో పడకముందే అధికారులు స్పందించి తవ్వకాలను నిలిపివేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.