తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వం కోసం సుదీర్ఘంగా పోరాడారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తొలిదశ ఉద్యమంలో కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని, ఎంతో మంది విద్యార్థులను పొట్టనబెట్టుకుందని మండిపడ్డారు. 2009 తర్వాత జరిగిన ఉద్యమంలోనూ 1200 మంది అమరులయ్యారని, నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని దారుణంగా అణిచివేసే కుట్ర చేసిందని ఆయన ధ్వజమెత్తారు.