BHPL: కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా మంగళవారం ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.