NLG: చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శిగా విధులు నిర్వహించి చండూరుకు బదిలీపై వెళ్తున్న జానయ్యకు వీడ్కోలు, నూతన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన జె. సత్యనారాయణకు స్వాగత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ పందిరి గీత రమేష్, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ నర్ర వినోద మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం జరిగింది.