NZB: మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం సీఐ 7 మొబైల్ ఫోన్లను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసి వారికి ఇవాళ అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో బాధితులు శ్రీకాంత్, సుధాకర్, ప్రమోద్, నదీమ్, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.