AP: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్పందించారు. ‘4 వేల SC, ST కేసుల్లో ఛార్జిషీట్ వేయించానన్నారు. SC, ST అట్రాసిటీ కేసులతో CIDకి సంబంధం లేదు. సెన్సేషనల్ ఉంటే 200 కేసులు టేకప్ చేయడం సాధ్యం కాదు. 4000 కేసుల్లో ఛార్జిషీట్ వేయించాననడం టూమచ్. ఛార్జిషీట్లు వేయడంలో సునీల్ పాత్రపై విచారణ జరపాలి’ అని డిమాండ్ చేశారు.