KRNL: వెల్దుర్తి మండలం మల్లేపల్లికి చెందిన శాంతికుమార్ ఇల్లు తాకట్టు పెట్టి రుణాలు ఇప్పిస్తానని, సగం తనకు ఇస్తే మొత్తం అప్పు తానే తీరుస్తానని పలువురిని నమ్మించి మోసం చేశాడు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు శాంతికుమార్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్దుర్తి ఎస్సై నరేశ్ తెలిపారు.