NLG: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఎస్పీ, ఇతర పోలీస్ అధికారులు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.