NMRL: ఎంతోమంది త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా నిర్మల్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు, అమరవీరుల స్తూపానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.