సత్యసాయి: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి సమావేశమయ్యారు. పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల విడుదలపై మంత్రితో చర్చించారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న తాగునీరు, రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు.