MHBD: పెద్దవంగర మండలంలోని అవుతాపురం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ను ధ్వంసం చేశారు. దీంతో అందులోని కాపారు వైరు దొంగిలించి మిగతా వాటిని చెల్లాచెదురుగా పడేసి వెళ్లిపోయారు. అదేవిధంగా చుట్టుపక్కల రైతుల భూములకు సంబంధించిన కరెంటు వైర్లను సైతం ఎత్తుకెళ్లినట్లు సమాచారం.