TG: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఖైదీల కుటుంబాలకు గుడ్న్యూస్ చెప్పింది. సత్ప్రవర్తన కలిగిన 92 మంది ఖైదీలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో 86 మంది పురుషులు, 6 మంది మహిళలు ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా కటకటాల్లో మగ్గుతున్న ఖైదీలకు విముక్తి కల్పించింది. ప్రభుత్వం నిర్ణయంతో ఖైదీలు, వారి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.