KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఈ వారం ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి. గత కొన్ని రోజులుగా పత్తి క్వింటాల్ ధర గరిష్టంగా రూ. 7,550 నుంచి రూ. 7,600 మధ్యనే ఊగిసిలాడింది. శుక్రవారం మార్కెట్కు 28 వాహనాల్లో 226 క్వింటాళ్ల విడి పత్తి రాగా గరిష్టంగా రూ. 7,550 పలికింది.