WGL: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని నల్లబెల్లి సీపీఐ మండల కార్యదర్శి బట్టు సాంబయ్య డిమాండ్ చేశారు. 2001-2014 వరకు పోరాడిన ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్ల అయినప్పటికీ ఉద్యమకారులకు న్యాయం జరగలేదని అన్నారు.