BHNR: ప్రభుత్వాలకు ముందుచూపు లేక మార్కెట్లలో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని సీపీఎం జిల్లా నేత బూరుగు కృష్ణారెడ్డి విమర్శించారు. చౌటుప్పల్లో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు నెలలుగా కొనుగోళ్లు సాగక, అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. త్వరితగతిన కొనుగోళ్ళు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.