VZM : గంట్యాడ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ‘అంగన్వాడి పిలుస్తోంది’ అవగాహన ర్యాలీలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. గంట్యాడ ఐసీడీఎస్ సీడీపీఓ ఉమాభారతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన ఆహ్లాదకరమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు.