PLD: అచ్చంపేట (మం) చల్లగరిక, తాడువాయి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం వేటగాళ్లు మాటు వేశారు. సమాచారం అందుకున్న బీట్ అధికారి వరప్రసాద్ దాడి చేయడంతో, వారు వాహనాన్ని, నాటు తుపాకీని వదిలేసి పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న సామాగ్రిని పోలీసులు, ఫారెస్ట్ అధికారులు స్టేషన్కు తరలించి, వేటగాళ్ల కోసం గాలిస్తున్నారు.