WGL: నెక్కొండ పట్టణ కేంద్రంలో సర్వే నెం.284/1/1, ప్లాట్ నెం.01లో 17.11 చ.గజాల స్థలాన్ని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం కోసం తమ్మ రాధారాణి గ్రామ పంచాయతీకి విరాళంగా ఇచ్చారు. స్థల పత్రాలను పంచాయతీ కార్యదర్శి డి. సదానందంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సింగం శ్రావణి ప్రశాంత్, యూత్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.