MDK: నర్సాపూర్ మండలంలోని గూడెంగడ్డ గ్రామానికి చెందిన ఆవంచ పోచయ్య (అలియాస్ అన్న పోచన్న) కాగజ్ మద్దూర్ శివారులోని పెద్ద చెరువులో శవమై తేలిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చెరువు వద్ద పనిచేస్తున్న రైతులు మృతదేహాన్ని గుర్తించి గ్రామస్థులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలనలు చేపట్టి కేసు నమోదు చేశారు.