AP: విశాఖలో 6 గిగావాట్ల డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు మంత్రి నారా లోకేష్. డేటా సెంటర్ల ఏర్పాటుకు VSP అన్ని విధాల అనుకూలమన్నారు. గూగుల్ AI హబ్, రిలయన్స్ AI డేటా సెంటర్లు పురోగతిలో ఉన్నాయని, AI, డేటా హైపర్ స్కేల్ హబ్‌గా VSP ఆవిర్భవిస్తోందని తెలిపారు. ఎయిర్ ట్రంక్ CEO రాబిన్ ఖుదాతో లోకేష్ భేటీ అయ్యారు. VSPలో ఆ సంస్థ క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరారు.