ప్రకాశం: మర్రిపూడి మండలం రామాయపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య సోమవారం పాల్గొన్నారు. ఆయన గ్రామంలో ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంచాడు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు కూటమి ప్రభుత్వం మాత్రమే పంచుతుందని పేర్కొన్నారు.