AP: ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతుందని, ప్రజల మనసుల్లో తాముండాలన్నదే తమ కల అని సీఎం చంద్రబాబు అన్నారు. పేదరికం లేని సమాజం చూడాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రతి ఒక్క ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చి ప్రజలకు అండగా ఉంటామన్నారు. బటన్ నొక్కితే ఆ ఆనందం రాదన్నారు. పింఛన్ల ద్వారా 62.34 లక్షల కుటుంబాలకు ఆర్థికసాయం చేస్తున్నామన్నారు. గతంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే రద్దు చేసేవారన్నారు.