MHBD: జిల్లాలో ఖాళీగా ఉన్న ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ (EDM) పోస్టు భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం చేపట్టనున్న ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ. 32 వేల వేతనం అందించనున్నారు. మే 31 నుంచి జూన్ 15 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.