NZB: పేదరికాన్ని జయించి ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులను దాతలు ఆదుకుంటున్నారు. MBBS సీటు సాధించిన బోధన్ వాసి సాయివర్ధన్కు NRI నాగేంద్ర రూ.లక్ష అందించారు. యూట్యూబ్ ద్వారా తరగతులు విని MBBS సీటు కొట్టిన పోచారంతండా కేతన్కు సాఫ్ట్వేర్ ఉద్యోగి హరీశ్ ఏటా రూ. 1.20 లక్షలు, బీటెక్ చదువుతున్న పిట్లం వాసి వైష్ణవికి లయన్స్ క్లబ్ ఏటా రూ. 1.20లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు.